Ysrcp: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం వైఎస్సార్సీపీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. విజయవాడ వరద బాధితుల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన దాతృత్వాన్ని నిరూపించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా అందరి కన్నా ముందుగా స్పందించే వైసీపీ ఈ సారి కూడా సాయానికి ముందుకొచ్చింది. ఈ మేరకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతం విరాళంగా ప్రకటించారు. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిసింది. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సహాయ సహకార కార్యక్రమాలలో ఈ విరాళాన్ని ఉపయోగించనుంది. దీని ద్వారా వరద బాధితుల అవసరాల నిమిత్తం ఆహరం, తాగునీరు, పాల ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అండగా నిలవనుంది.
అధికారంలో ఉన్నా, లేకపోయినా కష్టకాలంలో వైసీపీ అందించే సహాయ సహకారాలకు ఏదీ సాటి రాదు. ప్రజల బాగోగులే ఎప్పుడూ తన శ్వాసగా భావించి బాధితులకు తానున్నానంటూ భరోసా కల్పించడంలో వైఎస్ జగన్ ది ప్రత్యేకమైన స్థానం. ఇదివరకే వైఎస్ జగన్ కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తూ వైసీపీ తరపున సహయం అందిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.