Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో వరదలు సృష్టించిన భీభత్సం మనందరికీ తెలిసిన విషయమే. దీంతో వరద సహాయక చర్యలను చేపట్టిన ఏపీ ప్రభుత్వం నిర్విరామంగా వరద సహాయక చర్యలలో పాల్గొంటుంది. విజయవాడ ముంపు బాధితుల కోసం రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు వార్డుల వారీగా మంత్రులను ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను రంగంలోకి దింపి వరద సహాయక చర్యలను చేపడుతున్నారు. విపత్తు నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు 8 మంది ఐఏఎస్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో శరవేగంగా ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరు హెలికాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారాన్ని, నీటిని, పాలు, పండ్లు, బిస్కెట్స్, మెడిసిన్స్ పంపిణీ చేస్తున్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి మొదటి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా తీవ్రంగా కృషి చేస్తుంది.
ఇవంతా నాణేనికి ఒక వైపు అయితే మరొక వైపు ప్రజలకి కనీస సౌకర్యాలు లేక ఎలాంటి సహాయక చర్యలు అందక ఇంకా చాలా అవస్థలు పడుతున్నారు. ఒక వైపు కొన్ని కాలనీలలో ఆహారం వృధాగా పోతుంటే మరొక వైపు కొన్ని కాలనీలకి అసలు ఆహారమే అందట్లేదు. కానీ ఎల్లో మీడియా మాత్రం అందుకు భిన్నంగా ప్రజలకి అన్ని రకాలుగా చంద్రబాబు ప్రభుత్వం సహాయక చర్యలు అందిస్తుందని అన్ని రకాలుగా ఆదుకుంటున్నట్లు అందరికీ ఆహారం, మ౦చి నీరు మరియు రేషన్ అందజేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు తమకు పూర్తిగా సాహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం జర్నలిజం విలువలని పాటించకుండా ప్రవర్తిస్తోంది ఎల్లో మీడియా. క్షేత్ర స్థాయి పరిస్థితిని సాక్షి మీడియా మరియు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు బయట పడుతుంటే ఎల్లో మీడియా మరియు కూటమి ప్రభుత్వ నాయకులు ఎక్కడ తమ బండారం బయట పడుతుందో అని భయపడుతున్నర౦ట.
ఈ విధంగా నిజాలు బయట పెట్టేవారిని ఎల్లో మీడియా పేటీఎం కూలీలని అమ్ముడుపోయారని సంబోధించడం ఎంత వరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలేద్దాము. ఎవరైతే జర్నలిజంని మరిచిపోయి అమ్ముడుపోయి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారో వారే అమ్ముడుపోవడం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. కలికాలం అంటే ఇదేనేమో బహుశా. ఏది ఏమైనా ఎల్లో మీడియా చాలా అడ్డంగా దొరికిపోయిందని ఇక వారు చేసుకునే తప్పుడు ప్రచారాలని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాజకీయ వాదుల్లో వినిపిస్తున్న చర్చ. ఇదే జరిగితే గనుక ఇది కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి వెయ్యి ఏనుగుల బలం చేకూరినట్లే అని చెప్పుకోవచ్చు.