Tuesday, October 8, 2024

YS Jagan: నందిగం సురేష్‌ను పరామర్శించనున్న వైఎస్ జగన్

- Advertisement -

YS Jagan: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రేపు అనగా సెప్టెంబర్ 11 బుధవారం రోజున గుంటూరు వెళ్లనున్నారు. గుంటూరు జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను జగన్‌ పరామర్శించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీపై కక్ష గట్టి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఇష్టారీతిన దాడులు చేస్తూ కేసులను బనాయిస్తున్న సంగతి తెలిసిందే. చట్టాన్ని ఉల్లంఘించి మరీ అరెస్టులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను కూడా అరెస్టు చేసింది. గతంలోని టీడీపీ కార్యాలయం దాడి కేసును తిరగదోడి మరీ అక్రమ కేసులతో సురేష్‌ను టీడీపీ కూటమి ప్రభుత్వం అరెస్ట్‌ చేయించింది. కాగా, రేపు ఉదయం 11 గంట‌ల‌కు జగన్ గుంటూరు జైలుకు వెళ్లి నందిగం సురేష్‌ను కలిసి పరామర్శించనున్నారు.

2021లో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితుల్లో కేసులు నమోదయ్యాయి. అయితే మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన కేసును చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టమన్న గర్వంతో మళ్లీ తిరగదోడింది. ఈ క్రమంలోనే పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించింది. ఈ కేసులోనే 80వ నిందితుడిగా సురేష్‌ పేరును చేర్చింది టీడీపీ ప్రభుత్వం. దీంతో ఈ నెల 5వ తేదీన నందిగం సురేష్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేయించి.. రాత్రికి రాత్రే గుంటూరుకు తరలించారు. అప్పటి నుంచి సురేష్ గుంటూరు జైలులోనే ఉండగా.. రేపు జగన్ వెళ్లి పరామర్శించనున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!