Sunday, October 13, 2024

YS Jagan:వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. జిల్లా అధ్యక్షుల నియామకం

- Advertisement -

YS Jagan:వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత మరింత బలంగా ఎదగడానికి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా పార్టీలో నియామకాలు చేపడుతూ కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. జిల్లా అధ్యక్షులతో పాటుగా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను కూడా ఖరారు చేస్తున్నారు. అయితే.. ఇటీవలే జగన్ మూడు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరు పార్టీ కేడర్ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పలు జిల్లాలకు వైఎస్ జగన్ అధ్యక్షులను నియమించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఖరారు చేశారు. కాకాణికి కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జిగానూ బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా మళ్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించారు. ఎన్నికల సమయంలో పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు బనాయించగా.. జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా నిర్ణయించారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. కాగా, జగన్ నెల్లూరు జిల్లా నేతలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ను సొంత ప్రాంతమైన నెల్లూరు కార్పొరేషన్‌ పార్టీ పరిశీలకుడిగా, దీంతో పాటు మైనారిటీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహ్మద్‌ ఖలీల్‌ అహ్మద్‌ను నియమించారు. ఇందుకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!