Tuesday, October 8, 2024

YS Jagan: వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. రాజకీయాల్లో దుమారం

- Advertisement -

YS Jagan: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా టీడీపీ కూటమి ప్రభుత్వం మరో అంశాన్ని లేవనెత్తుతోంది. జగన్ తిరుమలకు వస్తే తనకు వెంకటేశ్వర స్వామి అంటే పూర్తి నమ్మకం ఉందని చెప్తూ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని, లేదంటే అడ్డుకుంటామని డిమాండ్ చేస్తోంది. మరోవైపు, బీజేపీలో ప్రముఖ నేతగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి సైతం ఈ విషయంపై స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘మాజీ సీఎం వైఎస్ జగన్ టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే పవిత్రమైన శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని, జగన్ అన్య మతస్తులు కావడంతో జీవో ఎంఎస్ నెంబర్ 311, రెవిన్యూ, ఎండోమెంట్స్ రూల్ నెంబర్ 16 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’ అన్న ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీనిపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది.

తిరుపతి లడ్డూపై చంద్రబాబు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వంద రోజుల పాలనలో హామీల అమలు జరగలేదనే ఇలా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది.జగన్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే డిక్లరేషన్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జగన్‌ గతంలో తిరుమల వెళ్లిన సందర్భాలను ప్రస్తావించింది. పాదయాత్రకు ముందు కూడా తిరుమల వెళ్లారని, సీఎం హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని.. అలాంటి జగన్ ఇప్పుడు డిక్లరేషన్‌ ఇవ్వాలా అని సూటిగా నిలదీసింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!