Friday, July 19, 2024

బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు వైఎస్ షర్మిల..?

- Advertisement -

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుతురు., వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల రెండు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఆమె తన అన్నను కాదనుకుని తెలంగాణలో పార్టీ పెట్టిన సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణలో ఆమె తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చాలానే కష్టపడుతున్నారు. దీనిలో భాగంగానే ఆమె రాష్ట్రం అంతటా కూడా పాదయాత్రను చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికి షర్మిలను వైసీపీ కార్యకర్తలు అభిమానిస్తునే ఉంటారు. పార్టీలు వేరు అయినప్పటికి కూడా షర్మిల మీద గతంలో చూపించిన అభిమానాన్నే చూపిస్తుంటారు.

అయితే అన్నను ఇరుకున పెట్టాలని చేస్తున్నారో లేక.. తన రాజకీయ అవివేకంతో చేస్తున్నారో తెలియదు కాని.. షర్మిల చేస్తున్న కొన్ని పనులు వైఎస్ఆర్‌‌‌ను అభిమానించే వారికి నచ్చడం లేదు. తమ కుటుంబానికి బద్ద శత్రువు అయిన ఏబీఎన్ రాధాకృష్ణకు ఆమె ఇంటర్య్వూ ఇవ్వడం వైఎస్ఆర్ అభిమానించే ఎవరికి నచ్చ లేదు. దీంతో పాటు ఇటీవల హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పెట్టడాన్ని కూడా ఆమె తప్పుపట్టింది. ఇవి చాలవు అన్నట్లుగా.. తాజాగా మరోవార్త తెర మీదకు వచ్చింది. సినీ నటుడు , హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య హోస్ట్‌గా వ్యవహారిస్తున్న అన్‌స్టాపబుల్ షోకు వైఎస్ షర్మిల ముఖ్య అథితిగా రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించడానికి అన్ని అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు టీడీపీ అధినేత. దీనిలో భాగంగానే తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఆయన వినియోగించుకుంటున్నారు. దీనికి ఆహాను కూడా ఆయన వినియోగించుకుంటున్నట్లు తెలుస్తుంది.

బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్‌గా వచ్చిన చంద్రబాబు..తాను ఎటువంటి సమయంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవాల్సి వచ్చిందో తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి.. వైసీపీ కార్యకర్తల మనస్సును కూడా గెలిచే ప్రయత్నం చేశారాయన. ఇక రాబోవు కాలంలో కూడా అన్‌స్టాపబుల్ షోకు రాజకీయ నాయకులను కూడా పిలవడానికి సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆహా ఓటీటీ మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్‌ది. ఆయన ఎలాగు పవన్ కల్యాణ్ కోసం పని చేస్తారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. పవన్ ఎటు టీడీపీ గెలుపు కోసం పని చేస్తారు .. ఇలా అన్ని విధాల అన్‌స్టాపబుల్ షోను తమకు ఉపయోగకరంగా వాడుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది. దీనిలో భాగంగానే బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు షర్మిలను ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతుంది. అన్‌స్టాపబుల్ షోకు షర్మిలను ఆహ్వానించి… అన్న-చెల్లెలు మధ్య ఏం జరిగిందని కూపీ లాగాలని వీరి ప్లాన్‌గా తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, ఆమె అన్‌స్టాపబుల్ షోకి వస్తే ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చించనున్నారనేది హాట్ టాపిక్ అయింది. అందులోనూ బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారోనని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!