దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల మేర రుణాలను తీసుకొని బ్యాంకులను అడ్డంగా మోసం చేయాలని చూసిన సుజనా చౌదరి చివరకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేతికి చిక్కాడు. ఒకే ఆఫీస్ వేదికగా ఏకంగా 126 బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసి మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడని అధికారులు గుర్తించి విచారణకు రావాలని ఆదేశిస్తే, ఢిల్లీ హైకోర్టు ద్వారా తనను విచారించకుండా ఆర్డర్ పాస్ చేయాలని పెట్టుకొన్న పిటిషన్ కొట్టి వేసి విచారణకు హాజరుకావలసిందే అని స్పష్టం చేసింది.

చివరకు చేసేదేమి లేక చెన్నైలోని ఈడి ఆఫీస్ కు వెళ్లి నిన్న హాజరయ్యాడు. కానీ ఈడి అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే పని చేస్తున్నట్లు తెలుస్తుంది. తనకేమి తెలియదని 2010 తరువాత తాను డైరెక్టర్ గా లేనని మాత్రమే సమాధానం చెబుతున్నట్లు తెలుస్తుంది. మొదటి రోజు విచారణలో ఏమి తేలకపోవడంతో ఈడి అధికారులు ఈరోజు కూడా సుజనా చౌదరిని విచారణకి రమ్మని చెప్పడంతో, ఈరోజు కూడా ఈడి అధికారుల ముందు హాజరయ్యాడు.   

తనకు సంబంధం లేదని చెబుతున్న సుజనా చౌదరికి ఈడి అధికారులు ఆయనకు ఆ కంపెనీలతో ఎలాంటి సంబంధం ఉందో ఆధారాలతో సహా బయటపెట్టినట్లు తెలుస్తుంది. కోర్ట్ ద్వారా తప్పించుకోవాలని చూసిన సుజనా చౌదరి, ఇప్పుడు ఈడి అధికారులకు సమాధానాలు చెప్పకుండా ముప్పుతిప్పలు పెట్టి అడ్డంగా అడ్డ దారిలో తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని చెబుతున్నారు. సుజనా చౌదరి చేసిన మోసం విజయ్ మాల్యా, నీరవ్ మోడీల కన్నా పెద్ద స్కామ్ అని, ఇప్పటికే వారిద్దరూ దేశం వదిలి పారిపోవడంతో సుజనా చౌదరి కూడా తప్పించుకొనే అవకాశాలు ఉన్నాయని, మీడియాలో వార్తలు రావడంతో పోలీసులు అలెర్ట్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. సుజనా చౌదరి తాను చేసి తప్పుల నుంచి తప్పించుకునే ప్రసక్తిలేదని పక్కా ఆధారాలతో త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది.