సూపర్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఈ రోజు టీడీపీలో చేరారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన సమస్యల్లో ఉందని అన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. సీఎం చంద్రబాబు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. కాగా గతంలో వైసీపీలో ఉన్న ఆదిశేషగిరిరావు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.