ఏపీ మంత్రి అఖిల ప్రియ టీడీపీకి దూరమవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తల్లి మరణం ద్వారా ఉపఎన్నికల ద్వారా ఎమ్మెల్యే అయిన అఖిల ప్రియ… ఆ తర్వాత టీడీపీలోకి పిరాయించిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత కొద్ది కాలానికే అఖిల మంత్రి అయ్యారు. అయితే భూమా నాగిరెడ్డి అనుచరుడైన సుబ్బారెడ్డికి అఖిల వ్యవహార శైలి నచ్చలేదు. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. అఖిలకు వ్యతిరేకంగా అనేక పంచాయితీలు చంద్రబాబు వద్ద జరిగాయి. జిల్లాలోనే టీడీపీ నేతలు కొందరు అఖిలకు వ్యతిరేకంగా పావులు కదిపారు. ఈ పరిణామాలతో ఆమె కొంత కలత చెందింది. కానీ తనను నమ్ముకున్న కార్యకర్తలే ముఖ్యమని అంటున్నారు అఖిల ప్రియ.

మంత్రి అఖిల ప్రియా పార్టీ మారుతుందనే ప్రచారం జిల్లా నేతలతోనూ పార్టీలోనూ జోరుగా ప్రచారం జరుగుతుంది. పైగా రాబోయే ఎన్నికలలో భూమా కుటుంభం నుండి ఒక్కరికే టికెట్ వస్తుందన్న సమాచారం. దీనితో ఆళ్లగడ్డ టికెట్ రాబోయే ఎన్నికలలో భూమా బ్రహ్మానంద రెడ్డి కి ఇచ్చి.. నంద్యాల టిక్కెట్టు మైనారిటీలకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. దీనితో అఖిల ప్రియకు చంద్రబాబు మొండి చేయి చూపెడతారని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలతో జిల్లా పర్యటనకు చంద్రబాబు వచ్చిన అఖిల ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

pawan akhila priya

ఇక మంత్రి అఖిల ప్రియ టీడీపీని వీడి జనసేనలోకి వెళతారని ప్రచారం జరుగుతుంది. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం నుండి అఖిల తల్లి శోభా నాగి రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ పరిచయాలతో అఖిల జనసేనలోకి వెళుతుందంటూ ప్రచారం జరుగుతుంది. జరిగిన పరిణామాలు నేపథ్యంలో అఖిల వైసీపీలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో జనసేనలోకి వెళ్లుతున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.