2014 అసెంబ్లీ ఎన్నికలలో చీరాల నియోజకవర్గం నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిదాదాపుగా 10 వేల ఓట్ల పైచిలుకతో విజయం సాధించారు. ఆమంచి గెలిచిన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరిన దగ్గర నుంచి టీడీపీ అభ్యర్థిగా కొనసాగుతూ వచ్చారు. ఇక ఇప్పుడు చీరాల నుంచి గెలిచినా ఆమంచిని వైసీపీ పార్టీలో చేర్చుకొని వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ తరుపున పోటీ చేయించడానికి వైసీపీ అధినాయకత్వం సిద్ధమవుతుంది.

ఇప్పటికే ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ వైసిపి పెద్దలు ప్రకాశం జిల్లాపై దృష్టి పెట్టింది. ఇప్పటికే దగ్గుపాటి కుటుంబాన్ని వైసీపీలో చేర్చుకొని వైఎస్ జగన్ వచ్చే ఎన్నికలలో పర్చూరు స్థానాన్ని కైవసం చేసుకునేలా పధకం రచించారు. దగ్గుపాటి కూడా మొదటి నుంచి ఆమంచితో మంచి పరిచయాలు ఉండటంతో దగ్గుపాటి వెంకటేశ్వర రావుతో పాటు, విజయసాయి రెడ్డి ఆమంచి కృష్ణ మోహన్ తో చర్చలు నెరపి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించడంతో, గతః కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ఆమంచి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక గత వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ పసుపు – కుంకుమ పేరుతో చేస్తున్న హడావుడిలో కూడా చీరాల నియోజకవర్గంలో ఆమంచితో పాటు తన అనుచరులు కూడా ఎక్కడ పాల్గొనడం లేదు.

ఆమంచి ఇప్పటికే తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేయగా అందరూ ముక్త కంఠంతో వైసిపిలోకి వెళ్లాలని కోరినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికలలో ప్రకాశం జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా వైసీపీ అధినాయకత్వం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడుతుంది. ఆమంచి కృష్ణ మోహన్ పార్టీ మారతాడనే వార్తలు బయటకు రావడంతో ప్రకాశం జిల్లా సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ కారణం బలరాం…. ఆమంచి కృష్ణ మోహన్ తో చర్చలు జరిపి అవసరమైతే మంత్రి పదవి ఇస్తామని, వైసీపీలోకి వెళ్ళ వద్దని కోరినట్లు తెలుస్తుంది. కానీ ఆమంచి మాత్రం వైసీపీ పార్టీ వైపు వెళ్లడానికి మొగ్గుచూపుతున్నట్లు కనపడుతుంది. వచ్చే పది రోజులలో మంచి ముహూర్తం చూసుకొని ఆమంచి వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.