రాబోయే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వస్తుందని.. అమరావతే రాజధానిగా ఉంటుంది.. అని పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు సీనియర్‌ నేత ఉమ్మారెడ్ది వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. దీనిని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తామన్నారు. మెరుగైన రాజధానిని నిర్మించడమే తన లక్షమన్న ఉమ్మారెడ్డి.. ఈ విషయంలో తమ పార్టీకి నష్టం కలిగించేలా.. ప్రజలను గందరగోళ పరిచేలా కొంతమంది వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.

అలాగే విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. మహిళా సంక్షేమం, వారి సమస్యలు తెలుసుకోవడానికి ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగుల సంక్షేమంపై సమగ్రంగా చర్చించి, తుదిరూపం ఇవ్వాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఇక వ్యవసాయం, ఇరిగేషన్, పాడి పరిశ్రమ తది తర అంశాలపై సబ్ కమిటీని ఏర్పాటు చేసి సమాచారం స్వీకరిస్తామన్నారు ఉమ్మారెడ్డి.

uma reddy