2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాడేపల్లి, తుళ్లూరు, అమరావతి పరిసర ప్రాంతాలలో వేల ఎకరాల భూములు ప్రభుత్వం రాజధాని పేరుతో తీసుకుంది. కానీ కొంత మంది రైతులు ప్రభుత్వానికి తమ భూములు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో డిసెంబర్ 29, 2014 రాత్రి సమయంలో దాదాపుగా 13 చోట్ల పంట పొలాలను తగలబెట్టారు. తలబడిన పంట పొలాలు దావానంలా వ్యాపిస్తూ రైతులు గగ్గోలు పెడుతుంటే, మరోవైపున తెలుగుదేశం ప్రభుత్వం ఈ నిర్వాకానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడంతో పాటు, గొప్ప రాజధాని చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్నాడన్న అక్కసుతో కడప గుండాలు వచ్చి చేసారని ఎన్నో కథనాలు పచ్చ మీడియాలో వండి వార్చారు.

పంట పొలాలు తగలబడిన రైతులను కలిస్తే వారు మాత్రం తమ పొలాలు రాజధాని కోసం ఇవ్వమని చెప్పినందుకే ప్రభుత్వమే అక్కసుతో ఇలా వ్యవహరించిందని చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ వైసిపి పార్టీపై దూషణలు చేస్తూ, త్వరలో దోషులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పనిచేసే పోలీసులు నిజంగా వైసిపి పార్టీ నాయకులు కనుక ఈ వ్యవహారానికి పాల్పడి ఉంటే, పంటలు తగలబెట్టిన దోషులను రెండు రోజులలో మీడియా ముందుకు తీసుకువచ్చి కఠినంగా శిక్షించేందుకు వెనుకాడేవారు కాదు.

కానీ జరిగిన సంఘటన వెనుక వైసిపి పార్టీ లేదని, తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దలు ఉండటంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, నాలుగు సంవత్సరాల విచారణ తరువాత దోషులు ఎవరు దొరకలేదని అందుకని కేసు క్లోజ్ చేస్తున్నామని ప్రకటించారు. అంటే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో జరిగిన సంఘటనకు సంబంధించి దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతో, ఇంత కంటే దద్దమ్మ ప్రభుత్వం మరొకటి లేదని చెప్పుకోవచ్చు. గతవారం రాష్ట్రంలోకి సీబీఐ రాకూడదని ఆంధ్రప్రదేశ్ “ఏసీబీ” వారే కేసులు విచారిస్తారని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదని ఇచ్చిన జీవో నిజంగా అమలైతే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మరోసారి బ్రిటిష్ పాలనను మెప్పించేలా పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈపరిణామాలు చూస్తే తెలుస్తుంది.

తుని రైలు దుర్ఘటన సమయంలో కడప గుండాలు వచ్చి రైలు తగలపెట్టారని టీడీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేసారు. అప్పట్లో భూమన కరుణాకర్ రెడ్డిని కూడా రెండు, మూడు సార్లు విచారణ పేరుతో పిలిపించుకున్నారు. కానీ తరువాత ఏమి తేల్చకుండా మిన్నకుండిపోయారు. రాష్ట్రంలో ముందుగా ఏ సంఘటన జరిగినా వైసిపి పార్టీ చేయించిందని చెప్పడం వరకే తప్ప, దోషులను పట్టుకొని శిక్షించే పని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయడంలేదు. దోషులను పట్టుకోవడంలో ప్రతి కేసులో ప్రభుత్వం ఇలా విఫలమవుతుంది అంటే ఇది కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కుట్ర అని ఆరోపించినా ఆశ్చర్యం లేదు.