ముస్లిం ఓట్ల కోసం అన్ని ప్రధాన పార్టీలు మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వైపు చూస్తున్నాయి. ఈ ఎన్నికలలో అసదుద్దీన్ ఒవైసీ టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని కోరేందుకు నిర్మల్ వచ్చారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల ఆధ్వర్యంలో అసదుద్దీన్ ఒవైసీ నిర్మల్ లోని బహిరంగ సభలో పాల్గొన్నారు.

నిర్మల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి… అసదుద్దీన్ ఒవైసీ కి ఫోన్ చేసి నిర్మల్ లో జరిగే సభకు హాజరు కాకపోతే 25 లక్షల రూపాయలు డబ్బు ఇస్తానని చెప్పినట్లు అసదుద్దీన్ ఒవైసీ సంచలన ఆరోపణలు చేసారు. తనను డబ్బుతో ఎవరు కొనలేరని, మహేశ్వర్ రెడ్డి తనకు డబ్బు ఎర చూపించాడని, దానికి సంబందించి నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయని అన్నారని మీడియా ఛానల్ లో వార్తలు వచ్చాయి. టిఆర్ఎస్ పార్టీని నిర్మల్ లో గెలిపించాలని, ముస్లిమ్స్ అంత టిఆర్ఎస్ పార్టీ వైపే నిలబడాలని పిలుపునిచ్చారు. అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు మహేశ్వర రెడ్డి ఖండించారు. టిఆర్ఎస్ పార్టీ వెనుక ఉండి ఇది అంత నడిపిస్తుందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.