ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబుపై ఉద్యోగులు మరోసారి తిరగబడ్డారు. విజయవాడలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశానికి వచ్చిన అశోక్ బాబు రాకపై ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. అశోక్‌బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనను వేదికపైకి ఆహ్వానించడాన్ని అడ్డుకున్నారు. ఉద్యమాన్ని చీల్చే ఇలాంటి నేతలను పిలవొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన ఉద్యోగులు.. అశోక్‌ బాబు వెంటనే వేదికపైనుంచి దిగిపోవాలని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సీఎం చంద్రబాబుకి తొత్తుగా మారి ఉద్యోగులకు అశోక్ బాబు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. దీనితో ఇక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.