పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం సహకరించకపోయినా చంద్రబాబు నాయుడు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎంత అడ్డుపడినా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతామని, పోలవరం డయాఫ్రామ్ వాల్ వైఎస్ జగన్ కు కనపడలేదన్నారని, మూడు వందల మీటర్ల డయాఫ్రామ్ వాల్ ఎలా కనపడుతుందని, జైలు ఊచలయితే బాగా కనపడతాయని అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేసారు.

డయాఫ్రామ్ వాల్ అంటే ఏమిటో తెలియని వ్యక్తి సీఎం అవ్వాలనుకోవడం దురదృష్టమని అన్నారు. వైసిపి నేతలు సుజల స్రవంతి ప్రాజెక్ట్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే సర్వనాశనమైపోతారని అయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో అతి పెద్ద దొంగ జగన్ అని, వచ్చే ఎన్నికలలో తిరిగి తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి తీసుకు రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.