రేవంత్ రెడ్డిపై జరిగిన ఐటి దాడులు ఇప్పుడు కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రేవంత్ రెడ్డి గురించి టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ రేవంత్ స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ కాదని, విశ్వరూపం సినిమాలో కమల్ హాసన్ అని, కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, అసలు రేవంత్ పై జరిగిన దాడులకు కేసీఆర్ కు సంబంధం ఏమిటని, ఎంతో మంది నేతలు విచారణలు హాజరవుతున్నారని… వైసిపి అధినేత వైఎస్ జగన్ కూడా విచారణకు హాజరై సహకరిస్తున్నారని, దమ్ముంటే రేవంత్ కూడా తనపై వచ్చిన ఆరోపణలకు విచారణ చేయించుకోవాలని తెలియచేసాడు.

రేవంత్ గురించి మాట్లాడటానికి నేను చాలని, మా పార్టీ వాళ్ళు నన్ను ఆపుతున్నారని లేకపోతే రేవంత్ ను ఉరికించి కొడతానని, తాట తీస్తా రేవంత్ అని సుమన్ హెచ్చరించాడు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరాచకవాదని, తామంతా తెలంగాణ ఉద్యమం కోసం జైలుకి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు పక్కన ఉన్నారని, ఇప్పటికి రేవంత్ చీకటి బాస్ చంద్రబాబే అని, చంద్రబాబు అండతో చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడని, అయన ఏజెంట్ లా మారి రాజకీయాలను భ్రస్టుపట్టిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఎన్నికల తరువాత ఏర్పాటయ్యే అసెంబ్లీలో బాల్క సుమన్ కూర్చుంటాడో, రేవంత్ రెడ్డి కూర్చుంటాడో త్వరలోనే చూద్దామని సుమన్ వ్యాఖ్యానించారు.