బళ్లారి అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది గాలి సోదరులు, ఆ ప్రాంతంలో వారిని కాదని రాజకీయాలు చేయడానికి కూడా బయపడతారంటే, గాలి సోదరుల హావ బళ్లారిలో ఎంతలా ఉందో అర్ధమవుతుంది. అలాంటి బళ్లారి సోదరులను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ – జేడీఎస్ పార్టీల అభ్యర్థిగా ఆ ప్రాంతం నుంచి సరైనా అభ్యర్థి దొరకకపోవడంతో, బయట ప్రాంతం నుంచి ఎమ్మెల్సీ వీఎస్ ఉగ్రప్పను తీసుకొని వచ్చి నిలబెట్టారు. ఇక బిజెపి పార్టీ నుంచి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములు సోదరి జె.శాంతను నిలబెట్టారు. కానీ ఎవరు ఊహించని రీతిలో బిజెపి అభ్యర్థి జె.శాంతపై కాంగ్రెస్ -జేడీఎస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప 2 లక్షల ఓట్ల పైగా బారి మెజారిటీతో విజయం సాధించారు.

గాలి సోదరులకు బళ్లారి పరిసర ప్రాంతాలలో ఎంత పేరు ఉందో, బిసి నేతగా శ్రీరాములు కూడా అంతే పేరు ఉంది. ఎన్నికలలో అతి సులువుగా విజయం సాధించవచ్చని లెక్కలు వేసుకున్న బిజెపికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సిద్ధ రామయ్య, డీకే శివకుమార్, దినేష్ గుండు రావు పక్కా వ్యూహంతో పార్లమెంట్ స్థానం కింద ఉన్న నియోజకవర్గాలన్నీ కలియ తిరుగుతూ అసంతృప్తులను బుజ్జగించుకుంటూ చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసారు.

2004 ఎన్నికల ముందు ఈ ప్రాంతమంతా కాంగ్రెస్ హావ అధికంగా ఉండేది. గాలి సోదరులు ఎప్పుడైతే రాజకీయాలలో అడుగుపెట్టి, రాజకీయం చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతమంతా తుడిచి పెట్టుకుపోయింది. మరలా తిరిగి ఒకటినర్ర దశాబ్దం తరువాత గాలి కుటుంబ హవాను బద్దలు కొట్టి కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని సాధించింది.

రెండు లక్షల పైగా బారి మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధించడానికి గాలి జనార్దన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా కారణంగా కనపడుతుంది. సిద్దరామయ్య కొడుకు చనిపోతే, గాలి జనార్దన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తరువాత గాలి దిగివచ్చి క్షమాపణలు కూడా కోరుకున్నారు. ఆ వ్యాఖ్యల ప్రభావం కూడా బళ్లారి లోక్ సభ స్థానం పై పడ్డాయని అంటున్నారు.

కర్ణాటకలో జరిగిన ఐదు చోట్ల జరిగిన ఉపఎన్నికలో బిజెపి నాలుగు చోట్ల ఓడిపోయి ఒక చోట మాత్రమే గెలవడంతో కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం సిద్ధ రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ “దీపావళి పర్వదినాన బళ్లారి ప్రజలు చీకటి నుంచి వెలుగులోకి వచ్చారని” అన్నారు. ఈ ఎన్నిక తరువాత బెంగళూరులోని బిజెపి ఆఫీస్ బోసిపోగా, కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటే, వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలలో కూడా ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని అన్నారు.