ఈరోజు జరగబోయే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవి కోసం ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం తన మద్దతు కూడా గడుతుంది. దీనిపై బిజెపికి ఎప్పుడు అండగా ఉండే శివసేన కొన్ని రోజులుగా బిజెపిపై కత్తులు దూస్తుంది., ఈ పరిణామాలతో శివసేన బిజెపికి అండగా నిలుస్తుందో లేదో అని అందరూ భావిస్తున్న తరుణంలో ఎన్డీయే అభ్యర్థికే తమ మద్దతు అని శివసేన ఎంపీ అనీల్ దేశాయ్ తెలియచేసాడు. గత నెలలో మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసతీర్మానానికి శివసేన దూరంగా ఉన్న సంగతి తెలిసిన విషయమే. శివసేన మద్దతు తెలపడంతో మోదీ సర్కార్ కొంత ఊపిరి పీల్చుకుంది.