ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద మతాల దాడి చేయడంలో ముందుండే బుద్ధ వెంకన్నకు తన సోదరుడే ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చాడు. బుద్ధ వెంకన్న సోదరుడు బుద్ధ నాగేశ్వర రావు ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసి వైసిపి పార్టీలో చేరారు. బిసిలకు న్యాయం చేయగలిగే ఒకే ఒక్క నేత వైఎస్ జగన్ మాత్రమే అని, బుద్ధ వెంకన్న బీసీల కోసం ఎప్పుడు పాటుపడిన దాఖలాలు లేవని, ఇంకా చాల మంది బీసీ నేతలు వైసిపిలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని, వైఎస్ఆర్ హయాంలో బీసీలకు ఎంతో మేలు జరిగిందని ఈ సందర్భంగా బుద్ధ నాగేశ్వర రావు తెలియచేసాడు.

బుద్ధ నాగేశ్వర రావు వైసిపిలో చేరికతో బుద్ధ వెంకన్నకు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఇంట గెలవలేని బుద్ధ వెంకన్న రోడ్ల మీదకు వచ్చి తన నోటిని అదుపులో పెట్టుకోకుండా ప్రతిపక్ష నేత అన్న గౌరవం కూడా ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్లు చేసే వ్యాఖ్యలతో బుద్దకు తన సోదరుడు సరైన బుద్ధి చెప్పాడని వ్యాఖ్యానిస్తున్నారు. బుద్ధ వెంకన్న 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఇప్పటికే బుద్ధ వెంకన్నపై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి.