ఎన్నికల వేళ మధ్య తరగతికి భారీ ఊరట ఇచ్చేలా ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ 2.5 లక్షల రూ 5 లక్షలకు పెంచారు. ఐటీ మినహాయింపు పరిమితి పెంపుపై భారీ ఆశలు పెట్టుకున్న వేతన జీవులను బడ్జెట్‌ సంతృప్తిపరిచింది. టీడీఎస్‌ పరిమితిని రూ 40 వేల నుంచి 50 వేలకు పెంచారు. రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. దీనితో లోక్సభలో అధికార పార్టీ సభ్యులు పెద్దగా హర్షం వ్యక్తం చేశారు. మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. ఇకపై ఐదు లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను ఉండబోదు.