పవన్ కళ్యాణ్ తన మాట, రూటు మార్చడంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా విసన్నపేటలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. పవన్‌ కళ్యాణ్‌ సింగపూర్‌ తరహా పరిపాలన కావాలన్నాడని.. ఫాక్ట్‌ ఫైండింగ్‌ సమావేశం పెట్టి 74వేల కోట్లు కేంద్రం నుంచి రావాలన్నాడని.. మరి ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడడం లేదని ఆయన అన్నారు. తాను అడగకుండానే జాతీయ పార్టీలు వచ్చి అవిశ్వాసానికి మద్దతు ఇచ్చాయన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం బీజేపీని వదిలి పెట్టె ప్రశ్నయే లేదన్నారు. నదులు అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం పార్టేదే నన్న బాబు.. ప్రధానమంత్రి మోడీ తనకు మెచ్యురిటీ లేదని మాట్లాడటం సరికాదన్నారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై పాండవులు విజయం సాధించినట్లు కేంద్ర ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ తప్పకుండ విజయం సాధిస్తుందన్నారు.