ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాటల గారడితో ప్రజలను ఏవిధముగా మోసం చేస్తాడనేది, అప్పట్లో పచ్చ మీడియా దెబ్బకు ప్రజలు గమనించకపోయినా ఇప్పుడు సోషల్ మీడియా దెబ్బకు చంద్రబాబు బాగోతమంతా బయట పడుతుంది. అందుకు సాక్ష్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తరువాత శశికళ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి ఎమ్మెల్యేలు అందరి చేత సంతకాలు చేయించి ముఖ్యమంత్రి పీఠంపై అధిరోహించే క్షణంలో జయలలిత కేసులో శశికళ జైలు పాలైంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు న్యాయం గెలిచిందని, తప్పు చేసిన ఎవరికైనా అదే గతి పడుతుందని, తన ప్రత్యర్థులకు కూడా అదే గతి పడతుందని వ్యాఖ్యానించారు. అప్పట్లో చంద్రబాబు బిజెపితో మంచి సత్సబంధాలు నడిపేవారు.

ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఐటి దాడులకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడుతూ, మనం కేంద్రం నుంచి బయటకు వచ్చిన తరువాత కేంద్రం మనం మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, అప్పట్లో శశికళ విషయాన్ని గుర్తు చేస్తూ తమిళనాడులో శశికళ మెజారిటీ నిరూపించుకున్నా ఆమెతో ప్రమాణస్వీకారం చేయించాల్సింది పోయి ఆమెను జైలు పాలు చేసారని, అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగేలా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు. కర్ణాటక ఎన్నికలలో శివకుమార్ పై కూడా అలానే ఐటి దాడులు చేసి ఇబ్బంది పెట్టారని, మనపై దాడులు చేయడానికి వస్తే గట్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు నాయుడు నాలుక ఎటు కావలసి వస్తే అటు తిరుగుతుంది అనడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. అప్పట్లో శశికళను అరెస్ట్ చేయడంతో న్యాయం గెలిచింది అన్న బాబు. ఈరోజేమో శశికళను అన్యాయంగా అరెస్ట్ చేసారని అంటున్నారు. చంద్రబాబుకి నిజంగా శశికళ చేసింది తప్పు అనిపించకపోతే అప్పట్లోనే ఎందుకు
శశికళను ముఖ్యమంత్రి పీఠంపై కుర్చోనివ్వకుండా కేంద్రం కుట్ర చేస్తుందని ప్రశ్నించలేదని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అసలు ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న ఐటి దాడులు సర్వసాధారణంగా జరిగేవే. ప్రతి సంవత్సరం అనుమానం వచ్చిన ఎవరి మీదైనా ఐటి శాఖ దాడులు చేసి సరైన పత్రాలు చూపకపోతే అరెస్ట్ చేస్తారు. అన్ని సరిగ్గా ఉంటె వారిని వదిలివేస్తారు.కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఐటి శాఖ దాడులు చేస్తుంటే గగ్గోలు పెడుతున్నదో అర్ధం కాకా అందరూ సతమతమవుతున్నారు. చంద్రబాబు డబ్బు ఏమైనా వారి దగ్గర ఉందా లేక చంద్రబబు బినామీల మీదే ఐటి శాఖ దృష్టి పెట్టిందా అన్నది ఒక రెండు మూడు రోజులలో క్లారిటీ వస్తుంది.