వైఎస్ జగన్ పై విశాఖ విమానశ్రయంలో జరిగిన దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడమంటే ఏపీ అధికారాలలోకి కేంద్రం అన్యాయంగా చొరబడడమేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అసలు దీనిపై రాజ్యాంగ పరమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్‌ఐఏ చట్టం వచ్చినపుడు వ్యతిరేకించిన ప్రధాని మోడీ ఇప్పుడు ఆ చట్టాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నారన్నారు. జగన్ ఎన్ని పాదయాత్రలు చేసిన ఉపయోగం లేదన్న బాబు.. పాదయాత్రంటే చిత్తశుద్ధి ఉండాలన్నారు. రోజుకు 8 కిలోమీటర్లు నడిస్తే దానిని పాదయాత్ర అంటారా? అని చంద్ర బాబు ప్రశ్నించారు.

గతంలో తన ఆరోగ్యం సహకరించపోయిన పాదయాత్ర చేశానని.. తాను నడిచి ప్రజల మనస్సులో స్థానం సంపాదించానన్నారు. అలాగే కాపు రిజర్వేషన్, తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్ కేంద్రం ఎందుకు ఆమోదించటలేదన్నారు. ఇప్పుడే అగ్రవర్ణాల రిజర్వేషన్లు గుర్తుకొచ్చాయా? అన్న బాబు.. 2019 ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడం కలే అన్నారు.