ఈమధ్య కాలంలో కేసీఆర్ కాంగ్రెస్, బిజెపి పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది ముక్యులను కలసి వచ్చిన పరిస్థితి తెలిసిందే. ఇందులో భాగంగా అప్పట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా కలసి కేసీఆర్ చర్చలు చేసారు. తరువాత కాలంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు పెంచుకొని వారితో కలసి పోవడంతో కేసీఆర్ కొంత తగ్గారు. ఇక ఇప్పుడు కేసీఆర్ మొదలు పెట్టిన ఫెడరల్ ఫ్రెంట్ ను మమతా బెనర్జీ టేకోవర్ చేసినట్లు కనపడుతుంది.

జనవరి 19న మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీకి కేసీఆర్ కు ఆహ్వానం ఉండదని తెలుస్తుంది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ, బిజెపికి వ్యతిరేకంగా అనుకున్న ఫెడరల్ ఫ్రంట్ లో ఇప్పుడు కాంగ్రెస్ వారు కూడా భాగస్వామ్యులు అవ్వడంతో కేసీఆర్ దూరమయ్యారు. జనవరిలో జరిగే ఫెడరల్ ఫ్రంట్ ర్యాలీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫెడరల్ ఫ్రంట్ నుంచి ర్యాలీకి ఆహ్వానం ఉంటుందని తెలుస్తుంది.

చంద్రబాబు నాయుడు బిజెపి నుంచి విడిపోయిన తరువాత కాంగ్రెస్ తో కొంత సఖ్యత నెరుపుతున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు ఫెడరల్ ఫ్రంట్ ర్యాలీలో పాల్గొనడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేసీఆర్ కాంగ్రెస్ నాయకులతో కలసి ఒకే వేదిక పంచుకునే అవకాశం లేకపోతే, చంద్రబాబు నాయుడు మాత్రం ఎంతో చక్కగా కాంగ్రెస్ నాయకులతో కలసి ర్యాలీలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కనుక ఏర్పడితే చంద్రబాబు నాయుడు కూడా ఈ ఫ్రంట్ లో యాక్టీవ్ రోల్ కూడా అయ్యే అవకాశం ఉంది.