ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కియా కార్లను ప్రారంభించి అందులో ప్రయాణం చేసి అందరిని ఆకట్టుకున్నారు. అమరావతి సచివాలయంలో కియా కార్లు, ఛార్జింగ్‌ స్టేషన్‌ను ఆయన గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడు రకాల కార్లను కియా సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వగా వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రారంభించారు. కారు తాళాలు సీఎంకు అందజేశారు. కియా కొత్త ఎలక్ట్రిక్ కారును ప్రారంభించి టెస్ట్ డ్రైవ్‌ను సీఎం పరిశీలించారు.

రాష్ట్రంలో కాలుష్యం తగ్గించే వాహనాల ప్రోత్సాహకానికి కియా సంస్థతో ఈ మేరకు ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్‌ తరం ప్రపంచ శ్రేణి రవాణా భాగస్వామ్యం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కియా ఎలిక్ట్రిక్ కార్లకు ఒక్కసారి ఛార్జింగ్‌ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే వీలుంటుంది. త్వరలో విజయవాడలో వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను కియా మోటార్స్‌ ఏర్పాటు చేయనుంది.

kia moters