చంద్రబాబు నాయుడు చేసే పనుల వలన రాష్ట్రానికి ఉపయోగమెంత ఉందొ తెలియదు గాని, ప్రజల పై మాత్రం భారం వేయడంలో సిద్ధహస్తుడిగా ఈమధ్య మారిపోయాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అది చేశాను, ఇది చేశాను అని గొప్పలు చెప్పుకోవడానికి చేసిన ఖర్చుని పేద వాడిపై ఖర్చు పెడితే ప్రజలలో చంద్రబాబుకి ప్రచారం లేకుండానే గొప్పవాడిగా కీర్తింప పడేవాడు. కానీ మొదటి నుంచి చంద్రబాబు అభివృద్ధి చేసినా చేయకపోయినా ప్రచారం మీదనే ఆధారపడేవారు. చంద్రబాబు చేసే ప్రచారం మొదట్లో అందరకి అర్ధమయ్యేది కాదు. అందరూ నిజంగానే చంద్రబాబు అన్ని గొప్ప పనులు చేశాడా? అని పక్క పార్టీల వారే నోరెళ్ళ పెట్టె అంత ప్రచారం చాప కింద నీరులా తన అనుకూల మీడియాతో చేయించుకునేవారు.

అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం, తెలుగు మీడియా రంగమంతా చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉండటంతో ప్రజలను మభ్య పెట్టడానికి అవకాశం దొరికేది. కానీ సోషల్ మీడియాపై ప్రజలలో అవగాహన పెరగటం, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో చంద్రబాబు నాయుడు నేను రాష్ట్రానికి ఎన్నో గొప్ప పనులు చేసానని ఎన్ని కోట్లు తగలేసి భజన కొట్టించుకున్నా సోషల్ మీడియాలో చంద్రబాబు వ్యతిరేక వర్గం వారు చంద్రబాబు చేసిన అభివృద్ధిపై పూసగుచ్చినట్లు పెట్టే ఒక్క పోస్ట్ తో చంద్రబాబు నాయుడు గాలి తీసేస్తున్నారు. దీనితో చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాపై మరింత దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీ తరుపున 600 మంది సోషల్ మీడియాకు సంబంధించి టిడిపి కోసం ప్రచారం చేయడానికి నియమించుకున్నారు. కానీ అందులో కూడా ఎటువంటి లాభాలు కనపడటం లేదు.

ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసింది కడుపు కాలినొడు సోషల్ మీడియాలో చంద్రబాబుకి వ్యతిరేకంగా పెట్టె పోస్టులు, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డబులిచ్చి సోషల్ మీడియాలో భజన కొట్టించుకునే పోస్టులకు చాల తేడా ఉంటుంది. అందులోనూ తెలుగుదేశం పార్టీ తరుపున సోషల్ మీద సభ్యులు ఎంత గొప్పగా పని చేద్దామనుకున్న లోకేష్ బాబు ఏదైనా మీటింగ్ లో ఐదు నిముషాలు మాట్లాడితే చాలు, పాపం వారు చేస్తున్నకష్టమంతా నీరు కారిపోతుంది. అసలే ఇప్పుడు ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ సోషల్ మీడియాలో వైసిపి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు దూసుకుపోతున్నారు.

చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలలో 600 హామీలు ఇచ్చి కనీసం ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చకపోవడంతో, చంద్రబాబు ఏదో అభివృద్ధి చేస్తాడని నమ్మి ఓట్లు వేసిన సామాన్యుడు కూడా వైసిపి, జనసేన పార్టీలతో కలసి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఫుట్ బాల్ ఆడుకుంటున్నాడు. కానీ చంద్రబాబు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన మీడియా చేత ప్రపంచంలోనే అమరావతిని గొప్ప నగరంగా మార్చే శక్తీ నాకే ఉందని భజన చేయించుకోవడంతో పాటు, ప్రజల డబ్బుని కోట్లలో ఖర్చు పెడుతూ మీటింగుల పేరుతో ఊకదంపుడు ప్రసంగాలతో తెలుగుదేశం పార్టీ సభ్యులనే కాకుండా, అధికారులను కూడా విసిగిస్తున్నారు. చంద్రబాబు ఇంకా 1995 రోజులులా మీడియాను అడ్డుపెట్టుకొని గెలిచేద్దామనుకుంటే జరిగే పనులు కావని ఎప్పుడు తెలుసుకుంటారో.