వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అభివృద్ధి అనే పదం అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికలలో మీ నియోజకవర్గాల నుంచే మీరే పోటీ చేస్తారని చెప్పి పార్టీలో చేర్చుకున్న బాబు ఇప్పుడు వారిని సర్వేల పేరుతో ముప్పుతిప్పలు పెడుతున్నారు. కానీ అసలు సంగతి అక్కడ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టి కోసం పని చేస్తున్న పచ్చ నాయకులతో ఇబ్బందులు 2019 ఎన్నికలలో రాకూడదని ఇప్పటి నుంచే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సర్వేల పేరుతో వచ్చే ఎన్నికలలో పోటీకి అనర్హులని చెబుతూ లీకులు వదులుతున్నట్లు తెలుస్తుంది. స్థానికంగా తెలుగుదేశం పార్టి బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలలో వైసిపి ఎమ్మెల్యేలను తీసుకొన్న తరువాత వర్గాలుగా విడిపోయి కొట్టుకునే వరకు వెళుతున్నాయి. ఈ పరిణామాలతో బాబు వేసిన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలా ఉందని టిడిపి నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

వైసిపి నుంచి పిరాయించిన కొంత మంది ఎమ్మెల్యేలు దీనిని జీర్ణించుకోలేక ఎదురు తిరుగుతుంటే వారు తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత కాంట్రాక్టుల పేరుతో ఎంత కమిషన్స్ వసూలు చేసారో, ఒకొక్కరు ఎంతెంత సంపాదించుకున్నారో అనే విషయాలు అన్ని వారి ముందు పెట్టడంతో వారికి దిమ్మతిరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాలన్నీ బయటపడటానికి కర్నూల్ నుంచి పిరాయించిన ఎమ్మెల్యే కారణమని చెబుతున్నారు. ఆ ఎమ్మెల్యే తన అనుచరుడికి జెడ్పి పదవి ఇప్పించుకోవడానికి చంద్రబాబును కోరినప్పుడు, తాను తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చాల నష్టపోయానని చెప్పడంతో తన చిట్టా మొత్తం చంద్రబాబు ఎమ్మెల్యే ఎదురుగా పెట్టడంతో ఆ ఎమ్మెల్యేకు నోట మాట రాలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు తెలుగుదేశం పార్టి నుంచి 2019 ఎన్నికలలో టికెట్ వస్తుందో రాదో అని తన అనుచరులు మాట్లాడుకుంటున్నారు.

అప్పట్లో పార్టీలోకి వచ్చేటప్పుడు కోట్ల డబ్బుతో పాటు, వచ్చే ఎన్నికలలో పదవుల హామీతో చేరినా, చంద్రబాబు తన పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలతో పార్టి విడిచిన వెళ్లిన సంగం మందికి పైగా ఎమ్మెల్యేలు వైసిపి పార్టీని వీడి వచ్చినందుకు సరైన శాస్తి జరిగిందని లోలోన మధనపడుతున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కరెక్ట్ పని చేస్తున్నాడని పిరాయించిన వారికి వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వకుండా అక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో పార్టి కోసం పనిచేసే వారికి టికెట్స్ కేటాయిస్తే పార్టి మరీనా ఎమ్మెల్యేలకు బుద్ధి వస్తుందని, రేపు ఒక వేళ వైసిపి అధికారంలోకి వస్తే వీళ్ళు మరలా తెలుగుదేశంలో గెలిచి వైసిపిలోకి జంప్ చేయరని గ్యారంటీ ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక వైసిపి నుంచి పిరాయించిన సంగం మందికి పైగా ఎమ్మెల్యేలు ఇక వచ్చే ఎన్నికలలో వారి టికెట్ అసలు వదులుకోవడం తప్ప ఇంకా ఏమి చేయలేరని తెలుస్తుంది. వైసిపి అధినేత కూడా వీరు తిరిగి పార్టీలో చేరినా టికెట్ ఇవ్వడానికి సుముఖంగా లేరని తెలుస్తుంది.

Tags : Chandrababu naidu, Ysrcp Mlas, Telugudesam Party, YS Jagan Mohan reddy, 2019 Elections