తెలుగుదేశం పార్టీ అడిగి మరీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడటంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న కొంత మంది సీనియర్ నాయకులకు మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే, ఎన్టీఆర్ చేతిలో నుంచి అన్యాయంగా టిడిపిని తన చేతిలోకి తీసుకున్న చంద్రబాబు తన కొడుకుతో పాటు, తన భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేయాలనుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఆ రోజు పార్టీని లాక్కుని ఎన్టీఆర్ మరణానికి కారణం అయితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కలసి ముందుకు వెళ్తూ మరోసారి ఎన్టీఆర్ ను చంపేశాడని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

ఈ పరిణామాలన్నీ ఇలా జరుగుతున్న క్రమంలో మాజీ ఎంపీ చింత మోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ 1995లో తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనుకున్నారని చెప్పారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతూ ఆ మాట మీ నోటి వెంట ఎన్టీఆర్ పలికించాడా? లేక చంద్రబాబు పలికించాడా? అని చింత మోహన్ పై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఈ నాలుగేళ్లలో ప్రజలకు మెరుగైన పాలనా అందించకపోగా, అమరావతి పేరుతో లాకున్న 30 వేల ఎకరాల వ్యవసాయ భూమి నిరుపయోగమవడంతో పాటు, తాత్కాలిక భవనాల పేరుతో వేల కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని మరో 20 సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లడాని అన్ని పక్షాలతో పాటు ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్ని సర్వేలలో వెల్లడవుతుంది.

మోదీ కూడా చంద్రబాబు చేస్తున్న అవినీతిని వెలికి తీసే పనిలో ఉన్నాడని తెలిసి, కాంగ్రెస్ పార్టీని తన సొంత అవసరాల కోసం శరణు కోరుతున్నాడని అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టిడిపిని అదే కాంగ్రెస్ పార్టీ ముందు మోకరిల్లేలా చేసి ఎన్టీఆర్ అభిమానులను శోకసంద్రంలో ముంచేస్తున్నాడు.

Chandrababu Naidu

రాబోయే రోజులలో చింత మోహన్ ఆలోచన కార్యరూపం దాల్చి నిజంగానే చంద్రబాబు తన అవసరాల కోసం తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు మొదటి సారి ఎమ్మెల్యేని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే కావడంతో, ఆ పార్టీలోని ముఖ్యనేతలతో ఉన్న సత్సబంధాలతో, తన కేసుల మాఫీ కోసం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రతి ఒక్కటి దేశ శ్రేయస్కరం కోసమనే చెప్పి ప్రజలను తన పచ్చ మీడియా చేత మభ్యపెట్టించగల నేర్పరని అంటున్నారు. చింత మోహన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు ఏవిధంగా బదులిస్తాడో అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీతో కలసి తెలుగుదేశం పార్టీ పనిచేయడాన్ని ఏవిధంగా టిడిపి సీనియర్లు ఒప్పుకోవడం లేదో, ఈ మైత్రిని కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా వ్యతిరేకిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడానికి తమ తమ ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ముందు ముందు మాజీ ఎంపీ చింత మోహన్ లాంటి నాయకులు ఎంత మంది బయటకు వస్తారో అని, ఎన్టీఆర్ గురించి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసి ఎన్టీఆర్ ను శాశ్వతంగా ప్రజల నుంచి దూరం చేయడానికి కొన్ని శక్తులు వెనక ఉంది నడిపిస్తున్నాయని ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.