చంద్రబాబు నాయుడు తనకు తెలిసిన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ వేదికగా షురూ చేసారు. ఇప్పుడు తెలంగాణాలో పరిస్థితి ఎలా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ వారికి నియోజకవర్గాల వారీగా టిడిపి అధినేత టిక్కెట్ల ఎంపిక చేస్తున్నట్లు ఉంది తప్ప, కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేస్తున్నట్లు లేదని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈరోజు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి “గెహ్లాట్” ఢిల్లీ నుంచి అమరావతి వెళ్లి చంద్రబాబుతో మంతనాలు చేయడమే.

ఈ మంతనాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారు కూడా ప్రధానాంశంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉండి స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం మేరకు అభ్యర్థుల ప్రకటన చేయాలి కదా? మరి అభ్యర్థుల ప్రకటనకు ముందు అమరావతి వెళ్లి చంద్రబాబుతో మంతనాలు ఏమిటి అనుకుంటున్నారా? ఇక్కడే మతలబు ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు మొత్తం డబ్బు తాను ఖర్చు పెట్టుకుంటానని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి భరోసా ఇచ్చాడని, దానికి తోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో కూడా తన హ్యాండ్ ఉండాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టి అగ్రనేతలు మరీ ఇంత దిగజారిపోయిందా? 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో పోరాడిన చరిత్ర నుంచి ఇప్పుడు తెలుగుదేశం పార్టి అధినేతకు సలాం చేసే దుస్థితి వచ్చామా అని వాపోతున్నారు. ఈ పరిణామాలు కనుక ఇలాగే ఉంటే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మునగడం ఖాయమని, చంద్రబాబు నాయుడుని నమ్ముకొని కాంగ్రెస్ అధిష్టానం తమ రాజకీయ భవిష్యత్ కూడా నాశనం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చర్చించుకుంటున్నారు.