తండ్రి స్వల్ప అస్వస్తతకు గురవడంతో ఆ భాద్యతను ఓ కూతురు భుజానికి ఎత్తుకుంది. తెలంగాణలో సంగారెడ్డి నియోజికవర్గంలో కొంతకాలంగా రాజకీయ వేడి రగులుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి అరెస్ట్ బంధ్ నిరసనలతో ఆ నియోజకవర్గం హోరెత్తింది. ఆ తర్వాత జగ్గారెడ్డి స్వల్ప అస్వస్థతతో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనితో జగ్గారెడ్డి బదులుగా ఆయన భార్య నిర్మల జగ్గా రెడ్డి, కూతురు జయా రెడ్డి నియోజికవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కూతురు జయారెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగ్గారెడ్డి ని గెలిపించాలని కోరింది.

మొట్ట మొదటి సారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జయారెడ్డికి కార్యకర్తల నుండి అనూహ్య స్పందన లభించింది. అచ్చం తండ్రి యాసలోనే మాట్లాడుతూ కార్యకర్తలలో ఉత్సహాన్ని నింపింది జయరెడ్డి. కాగా గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జగ్గారెడ్డి తెరాస అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.