మాజీ మంత్రి మాగుంట మహిధర్ రెడ్డి ఇవాళ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను మహిధర్‌రెడ్డి కలిసి పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నడంతో ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనపర్తి నియోజకవర్గం కొమరిపాలెం వద్ద దాదాపు 300 మంది కార్యకర్తలతో మహీధర్‌రెడ్డి జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా మహిధర్‌రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రాభివృద్ధి కాకుండా తన అభివృద్ధినే చంద్రబాబు కోరుకుంటున్నాడన్న ఆయన… వైయస్‌ఆర్‌సీపీ సిద్ధాంతాలకు ఆకర్శితుడినై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.

Tags: Manugunta Maheedhar Reddy, YS Jagan, Ysrcp, Prajasankalpa Yatra, Chandrababu