తెలంగాణ కాంగ్రెస్ టికెట్స్ లొల్లి ఇంకా సీట్ల జాబితా బయటకు రాకముందే మొదలైంది. ఒక్కో నియోజకవర్గంలో నలుగురైదురు పోటీ పడుతుండటంతో ఈరోజు రాహుల్ గాంధీ అందరిని ఢిల్లీ పిలిపించుకొని వారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి ఎవరికి టికెట్ వచ్చినా సహకరించమని కోరుతున్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు విషయమై సర్వే సత్యనారాయణ, తన అల్లుడు క్రిశాంక్ మంధ్య పోటీ రసవత్తరంగా నడుస్తుంది.

ఈసారి టికెట్ తనకే ఇవ్వాలని క్రిశాంక్ గట్టిగా కోరుతున్నాడు. దానికి సర్వే సత్యనారాయణ అడ్డుతగులుతూ తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు ముఖ్యమంత్రి, అయ్యే అవకాశం ఉందని అందు వల్లే నాకు సీటు కేటాయించే సమయంలో ఇలా అడ్డుపడొద్దని అల్లుడు క్రిశాంక్ కు చెబుతున్నాడు. తాము రాజకీయాలలోకి వచ్చిన తరువాత యువతకు వచ్చే సీట్లను ఎలా వదులుకుంటామని సర్వే సత్యనారాయణ అల్లుడు క్రిశాంక్ పట్టుబడుతున్నాడు. వీరిద్దరి గొడవతో కాంగ్రెస్ అధిష్టానం తల బొప్పి కట్టించుకోవడం ఎందుకని మరొకరిని ఎంపిక చేస్తుందేమో అని సర్వే సత్యనారాయణ తన అల్లుడిని కొంత బతిమిలాడే ధోరణిలో ముందుకు వెళ్తున్నాడు. కానీ క్రిశాంక్ మాత్రం తనకే టికెట్ దక్కాలని ఢిల్లీ లెవల్ లో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకటి, రెండు రోజులు ఆగితే మామ, అల్లుళ్ళలో ఎవరు టికెట్ దక్కించుకుంటారో తెలుస్తుంది.