తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్భ తగలనుంది. కాంగ్రెస్ మాజీ హోమ్ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పనున్నారు. సబితా ఇంద్రా రెడ్డి తో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కారు ఎక్కనున్నారు. అలాగే రెండవ విడతలో మరో నలుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరబోతున్నట్లు సమాచారం. అలాగే సబితా తనకు రెండవ మంత్రి వర్గ విస్తరణలో చోటు లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏ కారణం వల్ల అయినా ఆ చాన్స్‌ దక్కకపోతే ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ ఇస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఆ స్థానం నుంచి కార్తీక్‌కు సీటు ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నది తెరాస వర్గాల నుంచి అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. అలాగే తన నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభిరుద్ది చేయాలనే ఉద్దెశంతో తాను తెరాస లో చేరాలనుకుంటున్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి తెరాస లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. వారితోపాటు నిజామాబాద్‌ జిల్లా నుంచి గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె. సురేందర్‌ కూడా తెరాస లో చేరతారని అంటున్నారు. మొత్తం దాదాపు పది నుండి పదకొండు మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉండటంతో ఇప్పుడు గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం పార్టీ ఫిరాయిస్తే గ్రేటర్‌ హైద్రాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో పరిణామాలు శరవేగంగా మారుతున్న కాంగ్రెస్ ను చక్క దిద్దే భాద్యతను ఎవరు తీసుకోలేక పోవటం గమనార్ధం.

congress mla's