సబితా ఇంద్ర రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేయాలని ఆకాంక్షించాడు. కానీ మహాకూటమి పొత్తులో భాగంగా ఆ సీటుని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో, 40 ఓట్లు కూడా లేని పార్టీకి కాంగ్రెస్ ఎలా టికెట్ ఇస్తుందని, తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఎన్నో మాటలు చెప్పాడు.

చివరకు నిన్నటితో నామినేషన్స్ గడువు ముగిసినా నామినేషన్ వేయకుండా కాంగ్రెస్ పార్టీకి దాసోహమయ్యాడు. కార్తీక్ రెడ్డికి టికెట్ రాలేదని అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తనతో నడవడానికి సిద్ధమయ్యారు. కార్తీక్ రెడ్డి తల్లి సబితా ఇంద్ర రెడ్డిని కూడా పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కోరారు. కానీ అనుచరుల దగ్గర అంత రాద్ధాంతం చేసి, మీడియాలో రోజంతా ఫోకస్ అయిన కార్తీక్ రెడ్డి, తనకు టికెట్ దక్కకపోయినా కనీసం తన తల్లినైనా గెలిపించుకోవాలని ఒక మెట్టు దిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడానికి సిద్ధమయ్యాడు.

karthik reddy

కార్యకర్తలు మాత్రం కార్తీక్ కోసం ఎప్పటి నుంచో నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు రావడానికి సిద్ధపడితే, రాజకీయ అవసరాల కోసం తిరిగి కాంగ్రెస్ పార్టీతో కలసి పని చేయడానికి కార్తీక్ రెడ్డి సిద్ధమయ్యాడు. ఇది కదా రాజకీయమంటే… బెదిరించి టికెట్ తెచ్చుకుందామనుకుంటే, కాంగ్రెస్ పార్టీ లొంగకపోవడంతో గతి లేక తల్లి కోసమని కబుర్లు చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకొని కార్తీక్ రెడ్డి కోసం బయటకు రావడానికి సిద్ధపడిన కార్యకర్తలను నిలువునా ముంచి వేసి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడానికి నిచ్ఛయించుకున్నాడు.