తెలంగాణ సీఎం కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్న సంగతి తెలిసిందే. ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు ముమ్మరం చేసింది. పొత్తుల విషయంలోనూ కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెరాస ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ తో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు.

టీడీపీ తో పొత్తు విషయమై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో శనివారం హైదరాబాద్‌లో చర్చలు జరుపనున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్‌ వంటి నియంత పాలనలో తెలంగాణ ప్రజలు మగ్గకుండా ఉండాలంటే టీడీపీ సహా మిగతా పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు కాంగ్రెస్‌తో కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు ఉత్తమ్.