కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్ర దేవ్‌ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కిశోర్‌ చంద్ర… తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదు. ఆ పార్టీలో సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వడం లేదని కిశోర్‌ చంద్ర విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నీ భూస్థాపితం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని, అందుకే తాను బయటకు వస్తున్నానని స్పష్టం చేశారు.

గత నాలుగు నెలలుగా కాంగ్రెస్ లో జరుగుతున్న పార్టీ వ్యతిరేక చర్యలను ఎత్తి చూపుతూ పార్టీ అధిష్టానానికి తెలియజేసినప్పటికి స్పందనలేదని ఆరోపించారు. దీంతో మనస్థాపం చెంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2014లో అరకు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసిన కిశోర్‌చంద్రదేవ్‌ ఓడిపోయారు. దగ్గరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కిశోర్‌ తెలుగుదేశం లో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

kishore chandra dev