ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తెలుగు జాతిని అవమానించేలా పనిచేస్తుందన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్. ఈ రోజు జగన్ ను హైదరాబాద్ లో కలిశారు. భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు జై రమేష్. రాబోయే ఎన్నికలలో జగన్ నూటికి నూరుపాళ్లు విజయం సాధించడం ఖాయమన్నారు. పోటీ చేసిన చేయక పోయిన వైసీపీలో చేరుతానన్నారు. తమ భేటీలో ఎలాంటి డిమాండ్లు లేవని, పార్టీ విషయాలు, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించామని వెల్లడించారు.

తాను సుదీర్ఘకాలంగా తెలుగుదేశంలో ఉన్నప్పటికీ, ఎన్నడూ లబ్ది పొందింది లేదని అన్నారు.తాను చంద్రబాబుకు గాని, టీడీపీకి కాని ఉపయోగపడ్డానే తప్ప తను ఏ పని చేయించుకోలేదని రమేష్ చెప్పారు.1999 లో ఎంపీ సీటు ఇస్తానని చంద్రబాబు మాట తప్పారని అన్నారు. చంద్రబాబు తెలుగుజాతిని నీచంగా మారుస్తున్నారని మండిపడ్డారు జై రమేష్.

dasari jai ramesh

Jai Ramesh