నల్గొండలో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి ని గెలిపించాలని ప్రచారం చేస్తున్నాడు వెరైటీ సినిమాల దర్శకుడు రవిబాబు. ఇటీవలే ‘అదుగో’ సినిమాతో వచ్చిన ఈ దర్శకుడు కోమటిరెడ్డి తరఫున నల్లగొండలో ప్రచారం నిర్వహించాడు. కోమటి రెడ్డి చాలా మంచి మనిషి అని ఆయనను గెలిపించుకోవాలని.. ఆయనను గెలిపించుకోకపోతే అది దురదృష్టం అవుతుందని రవిబాబు వ్యాఖ్యానించాడు.

komati reddy