టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసారు. కిరణ్ దేశంలోనే అత్యధిక ధనవంతుడైన నాయకుడు అంటూ డొక్కా వ్యాఖ్యలు చేశారు. ఆయన కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరుతారని నాలుగేళ్ల క్రితమే తాను చెప్పానని ఆయన అన్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ కు అదనంగా ఒక్క ఓటు వచ్చిందని సెటైర్లు వేశారు డొక్కా.

కిరణ్ చేరికతో కాంగ్రెస్ కు ఒక్క ఓటు పెరగడం మినహా ఎలాంటి లాభం లేదన్నారు. కేవలం కిరణ్‌ ఓటు మాత్రమే కాంగ్రెస్‌కు పడుతుందన్న ఆయన… కిరణ్‌పైనా, తనపైనా విచారణ జరపాలని గతంలోనే గవర్నర్‌కు లేఖ రాసినట్లు వెల్లడించారు డొక్కా. కాగా కిరణ్‌ కుమార్ రెడ్డి తమ్ముడు అయిన కిషోర్‌ కుమార్‌ రెడ్డి టీడీపీలో బలమైన నాయకుడని చెప్పారు.

Tags: Dokka Manikya Varaprasad, Kiran Kumar Reddy, Congress Party, Telugudesam Party, Andhra Pradesh