తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ శివార్లలో 25 లక్షల మందితో ధూమ్ ధామ్ గా సబ నిర్వహించి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాలని చూసారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏప్రాంతంలో సభ పెట్టినా అదే రీతిలో సక్సెస్ చవిచూశారు. అందుకే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “ప్రగతి నివేదన” సభ కూడా అదే రీతిలో సక్సెస్ అవుతుందని నేషనల్ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా వచ్చి “ప్రగతి నివేదన” సభపై ఒక కన్ను వేసింది. కానీ సభ సక్సెస్ అయింది కానీ కేసీఆర్ చెప్పినా లెక్కలో నాలుగోవంతు జనం కూడా వచ్చి ఉంటారా అని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు కురిపిస్తున్నాయి. కొంత మందైతే ఆవేదన సభగా మిగిలిపోయిందని కేసీఆర్ మాటలో కూడా వేడి తగ్గిందని అనేక విమర్శలు చేసారు.

ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో “మహాకూటమి” ఏర్పాటు చేసి కేసీఆర్ కు అధికారం దక్కకుండా చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తుంది. అందుకు తగ్గట్లే కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం పార్టీలతో కలసి అధికారం కోసం అర్రులు చాస్తోంది. ఇదే అదునుగా కేసీఆర్ పెట్టిన సభపై విమర్శలు రావడంతో ఎప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు డీఎస్ ఒక్కసారిగా తన నోటికి పని చెప్పారు. దమ్ముంటే తనను సస్పెండ్ చేసుకోవచ్చని చెప్పి సంచలనం కలిగించారు.

డీఎస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎంపీ కేసీఆర్ తనయురాలు కవిత కొన్ని రోజుల క్రితం పార్టీ నాయకత్వానికి తెలియచేసిన విషయం తెలిసిందే, కానీ అప్పట్లో సైలెంట్ గా ఉండి సమయం కోసం వేచి చూస్తున్న డీఎస్ అంది వచ్చిన అవకాశాన్ని ఈ విధంగా టిఆర్ఎస్ పార్టీపై పగతీర్చుకుంటున్నాడు. ఇప్పటికే రాహుల్ గాంధీతో మంతనాలు ముగిశాయని, తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రాహుల్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ నెల 11 న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని ఉహాగానాలైతే వినపడుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకుంతా సులువుగా అయితే లేదని, అందుకే దైర్యం చేసి డీఎస్ కూడా విమర్శలు చేస్తున్నట్లు కనపడుతుంది. డీఎస్ తో పాటు మరికొంత మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.