ఈరోజు అన్ని దిన పత్రికలలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పేరు కూడా భారతి సిమెంట్స్ పెట్టుబడుల కేసులో చేర్చారన్న వార్తపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించాడు.

“Shocked to see the reports by select media today, where my wife was named as accused by ED. Saddened to see politics degraded to such levels where even family is not spared.”

రాజకీయాలు ఇంతగా దిగజారిపోయాయా అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్ చేసారు. ఇక్కడ గమనించాల్సింది గత ఏడు సంవత్సరాలుగా గుర్తుకు రాని భారతి పేరు ఇప్పుడే ఎందుకు గుర్తు వచ్చింది. అసలు ఏడేళ్ల తరువాత ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయాలు ఇంతలో దిగజారిపోయాయో తెలుస్తున్నాయి. ఇప్పుడు భారతిపై పెట్టిన కేసు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఏదో మతలబు ఉన్నట్లు తెలుస్తుంది.

చంద్రబాబుపై ఓటుకి నోటు కేసులో నేరుగా దొరికినా ఇంత వరకు పట్టించుకోని అధికారులకి, వైఎస్ జగన్ మీద మాత్రమే ఇంత కక్ష సాధింపు ఎందుకో అర్ధం కావడం లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పటికి మాకు మిత్రుడే అని పార్లమెంట్ వేదికగా కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అంటే… నిన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి వేసి చంద్రబాబు తన చాణక్యతని చాటుకున్నాడు. కేంద్రంలో రెండు పార్టీలతో సఖ్యత కొనసాగిస్తూ ఎప్పుడు ఎటు కావలసి వస్తే అప్పుడు అటు వైపు దూకడానికి గోడ మీద పిల్లిలా చంద్రబాబు వేచి ఉన్నాడు. అలాంటి చంద్రబాబుపై ఇంకా కేసులు పెట్టె దిక్కెవరని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.