జనసేన పార్టీలోకి మరో మాజీ ఐఎఎస్ అదికారి చేరారు. తమిళనాడులో ఛీప్ సెక్రటరీగా పని చేసి రిటైర్ అయిన పి.రామ్మోహన్ రావు పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. పవన్ ఈ సందర్భంగా ఆయనను రాజకీయ సలహాదారుడిగా నియమించారు. అన్నాడీఎంకే ప్రభుత్వం హయాంలోతమిళనాడు ప్రభుత్వ సీఎ్‌సగా రామ్మోహన్‌ రావు పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపారు. తనకు అండగా వచ్చినందుకు రామ్మోహన్‌ రావుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియచేసారు.

ex cs