ఈసారి గజ్వెల్ లో ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాను ఓడించి తీరుతానని కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డు సవాళ్లు విసురుతున్నాడు. కేసీఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు తనకు ఫోన్ చేసి కేసీఆర్ ను వోడించమని, అందుకు నీకు కావలసి వస్తే ఆర్ధిక సహాయం చేస్తానని చెప్పాడని ప్రతాప్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికలలో కేసీఆర్ గజ్వెల్ నియోజకవర్గంలో 18 వేల ఓట్లతో మాత్రమే గెలిచారు. 2014లో టిఆర్ఎస్ పార్టీ గాలులు తెలంగాణలో రాష్ట్రంలో గట్టిగా వీస్తున్న సమయంలో 18 వేల ఓట్లతో గెలవడమన్నది చాల తక్కువ మెజారిటీ అని చెప్పుకోవచ్చు.

గత నాలుగు సంవత్సరాలుగా కేసీఆర్ గజ్వెల్ లో అభివృద్ధి పనులు చేసాడని, దానితో పాటు గజ్వెల్ లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి హావ కూడా బాగా పెంచుకోవడం జరిగింది. కొంచెం గట్టిగా కష్టపడితే కేసీఆర్ ను ఓడించడం అంత కష్టమేమి కాదని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం గద్దర్ ను రంగంలోకి దింపినట్లు కనపడుతుంది.

Gaddar

గత నెలలో గద్దర్ రాహుల్ గాంధీతో పాటు, సోనియా గాంధీని కలసి చర్చలు చేసారు. ఆ సమయంలో సోనియా గాంధీ గద్దర్ ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినా గద్దర్ సున్నితంగా తిరస్కరించి మీకు నా మద్దతు ఉంటుందని తెలియచేయారు. ఆ మద్దతులో భాగంగానే గజ్వెల్ నుంచి గద్దర్ ను పోటీ చేయించి టిఆర్ఎస్ ఓట్ల చీలికపై దృష్టి పెట్టినట్లు కనపడుతుంది.

ఈరోజు గద్దర్ తాను గజ్వెల్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చేసిన ప్రకటనతో కొంత అలజడితో పాటు, టిఆర్ఎస్ శ్రేణులు కొంత అలర్ట్ అయ్యారని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న రాజకీయ క్రీడను గట్టిగా తిప్పి కొట్టేందుకు కేసీఆర్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. మంత్రి కేటీఆర్ మాత్రం ఈసారి గజ్వెల్ లో కేసీఆర్ కు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని దీమాగా చెబుతున్నారు.