కోడి కత్తి… కోడి కత్తి అని వెటకారం చేసిన వారికి నిన్న హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించడంతో, కోడి కత్తిపై వెటకారపు నవ్వులు నవ్విన వారి గుండెలలో గుణపంలో గుచ్చుకోవడం ఖాయంగా కనపడుతుంది. ముందుగా జగన్ పై జరిగిన కోడి కత్తి విషయంలో ఏపీ అడ్వకేట్ జనరల్ ను హైకోర్ట్.. ముద్ధాయిపై సెక్షన్ ౩ఏ కింద కేసు ఎందుకు నమోదు చేయలేదని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, ముద్దాయికి ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే జీవిత ఖైదు పడుతుందని చెప్పడంతో హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

అసలు ముద్దాయికి జీవిత ఖైదు పడరాదని మీరు ఎలా చెబుతారని ప్రశ్నించిందని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వివరించారు. ప్రభుత్వం ఈ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్.ఐ.ఏకు అప్పగించవలసిందేనని అన్నారు. కోడి కత్తి, కోడి కత్తి అని విమర్శించిన వారికి కేంద్ర దర్యాప్తు సంస్థ చేసే నిజాలు నిగ్గు తేల్చి కోడి కత్తి ఘాటుకు కారకులెవరో బయటపెట్టడం ఖాయంగా కనపడుతుంది.