ఆంధ్రప్రదేశ్ లో ఐటీ దాడులకు రంగం సిద్ధమైంది. భారీగా దాడులు, సోదాలు జరిపేందుకు ఐటీ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు కేబినెట్‌లో అత్యంత కీలకమైన మంత్రిగా ఉన్న నారాయణ ఇళ్లు, ఆఫీస్‌లు, కాలేజీలపై ఐటీ అధికారులు మెరుపుదాడులు చేశారు. విజయవాడ ఆటోనగర్‌లోని కార్యాలయం నుంచి ఉదయమే పలు ఐటీ బృందాలు దాడులకు వెళ్లాయి. అధికార పార్టీ టీడీపీకి చెందిన మంత్రి కావడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసుల భద్రతను తీసుకుని ఐటీ అధికారులు దాడులకు వెళ్లారు. 8 బృందాల ఆధ్వర్యంలో ఈ ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఐటీ దాడుల నేపధ్యలో టీడీపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలని పలువురి నేతలుకు టీడీపీ చూసించింది. ఇంకా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పైన దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.