వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమరశంఖం పూరిస్తున్నారు. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు జగన్ పాదయాత్ర జనవరి 9 వ తేదీతో పూర్తవుతుంది. దాదాపు 14 నెలల పాటు సాగిన పాదయాత్రతో జగన్ రెస్ట్ తీసుకోవట లేదు. పాదయాత్ర ముగియగానే వెంటనే తిరుపతి నుండి కాలి నడకన తిరుమలకి చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు జగన్. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లి కుటుంబ సభ్యులతో కలసి జెరుసెలం చేరుకుంటారు. ఇక జెరుసెలం నుండి వచ్చిన తర్వాత ఎన్నికల కార్యాచరణ రూపొందిస్తారు.

ఫిబ్రవరి 2 నుండి బస్సు యాత్ర ప్రారంభించబోతున్న జగన్.. ఈ యాత్ర దాదాపు 50 నియోజకవర్గాలలో కొనసాగుతుంది. అయితే బస్సు యాత్ర ఎక్కడి నుండి ప్రారంభించి ఎక్కడ నుండి ముగించాలనే దానిపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. సాధ్యమైనంత వరకు బస్సు యాత్ర పూర్తి చేసి ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోకి దిగాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇక వైసీపీ నుండి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జగన్ దాదాపుగా పూర్తి చేసినట్లు సమాచారం.