వైఎస్ జగన్ నిన్న సాయంత్రం, వైసిపి రాష్ట్ర బంద్ నేపథ్యంలో పెట్టిన ప్రెస్ మీట్ లో పవన్ పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. ఇంత వరకు పవన్ పై చోట మోట నేతలు మాత్రమే చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలు స్టేట్ లీడర్ అయిన వైఎస్ జగన్ చేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామాలతో వైసిపి, జనసేన కార్యకర్తలు ప్రముఖ టివి చానెల్స్ లో జగన్ వ్యాఖ్యలపై డిబేట్ ల కోసం ఆతృతగా ఎదురు చూసారు. కానీ ఏ ఛానల్ దీనిపై అంతగా స్పందించకుండా ఒక సామాన్యమైన వార్తగానే తీసుకున్నారు.

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటి వారు అనప్పుడే రెండు, మూడు న్యూస్ చానెల్స్ చాల హడావిడి చేసి పవన్ కళ్యాణ్ గురించి ఇంకా ఏమైనా మసాలా న్యూస్ దొరుకుతుందేమో అని చూసారు. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకొనే శ్రీరెడ్డి, కత్తి మహేష్ మాట్లాడిన మాటలకే డిబేట్స్ పెట్టిన చానెల్స్ వైఎస్ జగన్ విషయంలో మిన్నకుండి పోయాయి.

ఈ విషయాన్ని తెలుగుదేశానికి సంబంధించి సోషల్ మీడియాలో పచ్చ తమ్ముళ్లు హైలెట్ చేసి వైసిపి – జనసేన మధ్యలో కుంపటి రాజేసి చలి కాచుకోవడానికి ప్రయత్నిస్తుండగా, పచ్చ చానెల్స్ మాత్రం అంతగా స్పందించ కుండా లైట్ తీసుకున్నాయి. ఈ ఇష్యూ ఇంతటితో క్లోజ్ చేయడమే మంచిదని పచ్చ చానెల్స్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే టీ కప్పులో తుపానుల ఈ ఇష్యూ అంతటితో క్లోజ్ అయిపోయింది. సాక్షి ఛానల్ అయితే ఈ వార్తను ప్రసారం చేయడానికే ఆసక్తి చూపించలేదు.

ఇంత వరకు వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ గురించి స్పందించింది చాల తక్కువని, మీడియా వారు అడిగే ప్రశ్నలకు జగన్ వారి ఉచ్చులో పడి పవన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది. వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టడానికి వ్యూహాలు రచిస్తున్న జగన్ కు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంత మంచిది కాదేమో… పవన్ ను హీరోగా అభిమానించే చాల మంది జగన్ ను డైనమిక్ రాజకీయ నాయకుడిగా ఆరాధిస్తారు. వారి కోసమైనా వైఎస్ జగన్ కొంత సంయమనంగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉంటె మంచిది.

Tags : Ys Jagan, Ap Special Status, Pawan Kalyan, Telugudesam, Ysrcp