చంద్రబాబు నాయుడు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలుస్తానని అడిగాడా? లేక కాంగ్రెస్ పార్టీ పెద్దలు చంద్రబాబుని ఎన్నికలలో కలుపుకోవడానికి ప్రయత్నించడా అంటే కచ్చితంగా పచ్చ మీడియా మాత్రం చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతాడని కాంగ్రెస్ పార్టీ దేహి అంటూ చంద్రబాబు వద్దకు వచ్చిందని చెబుతారు.

ఈరోజు ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబే తమ వద్దకు వచ్చాడని, గతంలో కేసీఆర్ ను చంద్రబాబు ఎలా కలిసారో అలానే తమను ఇప్పుడు చంద్రబాబు కలిసాడని జానారెడ్డి తెలియచేసాడు. ప్రజాస్వామ్యం తదితర అంశాల కోసం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కలసి పనిచేస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు అందరూ చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో అవసరముందని, అందుకే చంద్రబాబు చెంతకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాయబారాన్ని పంపారని ఊహించుకుంటుంటే, జానారెడ్డి ఏమో చంద్రబాబే తమ వద్దకు వచ్చాడని చెప్పి మరో సారి చంద్రబాబు గాలి తీసేసారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న అందరిని ఏకం చేస్తానని పచ్చ మీడియాలో డప్పు కొట్టుకోవడం తప్ప, అసలు చంద్రబాబు నాయుడు నిజంగా దేశంలో ఉన్న అన్ని పక్షాలను ఏకం చేసే అంత స్థాయి ఉంటే, ఎందుకు అమరావతి వచ్చి చంద్రబాబును ఇంత వరకు ఏ పార్టీ నేత కలవడు… చంద్రబాబు మాత్రమే కలుస్తాడు అంటే సమాధానం లేదు. అది ఒక్క పచ్చ మీడియాకు మాత్రమే తెలుసు చంద్రబాబు ఎంత సమర్ధుడో.

పొత్తుల కోసం ప్రతి సారి చంద్రబాబే రాయబారాలు పంపుతాడు తప్ప, తాము ఎప్పుడూ చంద్రబాబుతో పొత్తు కోరుకోలేదని గతంలో చాలా పార్టీలు చెప్పాయి. ఇప్పడూ పవన్ కళ్యాణ్ కూడా అదే చెబుతున్నాడు. తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తన ఇంటి గుమ్మం తొక్కి తనకు మద్దతు ఇవ్వమని కోరాడు కాబట్టే ఇచ్చాను తప్ప, నాకు నేనుగా ఎప్పుడు చంద్రబాబుని అడగలేదని చెప్పాడు. దీనిపై తెలుగుదేశం సభ్యులు కూడా ఇంత వరకు మాట్లాడింది లేదు.

తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీతో 35 సంవత్సరాలుగా  అవిశ్రాంతంగా పోరాడుతుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు తన అవసరాల కోసం సిగ్గు విడిచి కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరడం ఆ పార్టీలోని నాయకులకు, కార్యకర్తలకు రుచించకపోయినా తప్పక పార్టీ జెండాను మోస్తున్నారు. చంద్రబాబు చేసే రాజకీయం అంటే మొదటి నుంచి ఇలానే ఉంటుంది తప్ప కార్యకర్తల మనోభావాలను అర్ధం చేసుకునే ప్రసక్తే ఉండదు.