జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర పేరుతో ప్రజలలో తిరుగుతూ తన పార్టీని సంస్థాగతంగా ఎలా బలోపేతం చేయాలా అని ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ తన ఒక్కడి పేరే ప్రతి చోట ప్రకటించుకుంటూ నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పి కార్యకర్తలతో పాటు సామాన్య జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.

ఇక్కడ కామెడి ఏమిటంటే ఈ ఏడూ నియోజకవర్గాలలో రెండు సీట్లలో ఒకటి ఎస్టీ, మరొకటి ఎస్సీ వర్గానికి కేటాయించవలసిన సీట్లు. ఈ స్థానాలలో కూడా పవన్ పోటీ చేస్తాను అన్నారంటే అది పవన్ అమాయకత్వం అనుకోవాలా లేక పవన్ కు స్క్రిప్ట్ రాసి ఇచ్చే వారి లోపం అనుకోవాలా అనేది ఒకసారి జనసేన పార్టీ బేరీజు వేసుకోవాలి.

ఇక నిన్న పిఠాపురం నుంచి తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నానని మరోసారి పవన్ కళ్యాణ్ చెప్పడంతో, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎనిమిది స్థానాలు ప్రకటించారని ఒకటి “ముమ్మీడివరం” నుంచి పితాని బాలకృష్ణ కాగా ఇక మిగిలిన ఏడూ స్థానాలలో పవన్ కళ్యాణ్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ కు మరోసారి పని చెప్పారు.

ఇలా పవన్ కళ్యాణ్ అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న అన్ని జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో జనసేన అభిమానులలోనే గందరగోళం నెలకొని ఉంది. ఇలాంటి ప్రకటనలతో జనసేన పార్టీలో ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ ను ఆ పార్టీలో సీనియర్ నాయకులు ఏ దిశలో నడిపిస్తున్నారో అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తరువాత మాట్లాడే ప్రతి మాటకు లెక్క కౌంట్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా తేడా జరిగితే సోషల్ మీడియా వేదికగా బడితెపూజకు నెటిజన్లు రెడీగా ఉన్నారు.