జనసేన పార్టీలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరారు. తూర్పు గోదావరి జిల్లా పోలవరం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్, పాముల రాజేశ్వరి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. తమ పార్టీలో చేరే వారికి ప్రజలను కలుపుకుని వెళ్లే శక్తి ఉందా? లేదా! అనే చూస్తానే తప్ప వారి ఆర్ధిక బలాన్ని చూడనన్నారు పవన్. ప్రజలకు ఇవ్వడానికి సినిమాల నుండి రాజకీయాలలోకి వచ్చానన్న ఆయన.. ప్రజల నుండి తీసుకోవడానికి పార్టీని ఏర్పాటు చేయలేదన్నారు.

ఇక రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ కి జనసేనలో టికెట్ ఖాయమైనట్లు సమాచారం. వర ప్రసాద్ కి పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈయన 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు. అలాగే మరో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి తూర్పు గోదావరి జిల్లా గన్నవరం నియోజకవర్గం నుండి 2009 ఎన్నికలలో గెలుపొందారు. రాజేశ్వరి గత సంవత్సరం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇప్పుడు జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.